ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అంబేద్కర్ కు ఘన నివాళి

నెట్​వర్క్, వెలుగు  : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్ 68వ వర్ధంతిని శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. పలువురు ఆయన విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, అన్నపురెడ్డిపల్లిలో అశ్వారావుపేట ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, సత్తుపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్​మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కల్లూరులో  ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్, మధిరలో అమ్మ పౌండేషన్​ చైర్మన్​, డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని, జడ్పీ మాజీ చైర్మన్​, బీఆర్​ఎస్​నాయకుడు లింగాల కమల్​రాజ్, పాల్వంచలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొ త్వాల శ్రీనివాసరావు, కేటీపీ ఎస్ లో మాల విద్యుత్ ఉద్యో గుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయ భాస్కర్ రావుతోపాటు ఆయాచోట్ల పలువురు నాయకులు మాట్లాడారు. భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ ఎదుర్కొన్న సవాళ్లు, ప్రపంచ స్థాయిలో ఆయన్ను కీర్తించే విధంగా ఎదిగిన తీరును నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.